: ధోనీ భవిష్యత్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకే వదిలి పెట్టాలి: మాజీ క్రికెటర్ అజహరుద్దీన్
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యే విషయాన్ని ఆయనే చెప్పాలని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ అన్నాడు. ధోనీ భవిష్యత్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకే వదిలి పెట్టాలని సూచించాడు. ఈ సందర్భంగా ధోనీ ఆటతీరును అజహర్ ప్రశంసించాడు. బెస్ట్ కెప్టెన్లలో ధోనీ ఒకడని, అన్ని ఫార్మాట్లలో టీమిండియాను మొదటిస్థానంలో నిలిపాడని, ముఖ్యమైన టోర్నమెంట్లలో టీమిండియాను గెలిపించాడని అన్నారు. 2019లో జరగనున్న ప్రపంచకప్ లో టీమిండియాకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించడం అనుమానమేనన్న సౌరభ్ గంగూలి అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అజహరుద్దీన్ పేర్కొన్నాడు.