: దేశం కోసం మోదీ ఎంతో కష్టపడుతున్నారు: ఐశ్వర్యారాయ్ బచ్చన్


దేశం కోసం ప్రధాని మోదీ ఎంతో కష్టపడుతున్నారంటూ బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రశంసించారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని పదవి అనేది నిర్వహించడం అంత తేలికైన విషయం కాదన్నారు. రాజకీయాల్లోకి తన ప్రవేశంపై సాధ్యాసాధ్యాలను చెప్పలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ప్రస్తుతం తల్లిగా, భార్యగా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా తాను విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నానని చెప్పింది. వృత్తి పట్ల తన సంతృప్తిని ఆమె వ్యక్తం చేసింది. జీవిత లక్ష్యాల గురించి ప్రశ్నించగా... జీవితమనేది ఒక ప్రయాణమంటూ వేదాంత ధోరణిలో తన సమాధానాన్ని కొనసాగించింది. కాగా, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సరబ్ జిత్’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News