: అనారోగ్యంతో కన్నుమూసిన సినీ దర్శకుడు విక్రమ్ గాంధీ


టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ విక్రమ్ గాంధీ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విక్రమ్ గాంధీ స్వస్థలమైన కృష్ణా జిల్లా గన్నవరంలో మృతి చెందారు. సుదీర్ఘ కాలం సినీ పరిశ్రమలో ఉన్న విక్రమ్ గాంధీ మృతిపై సినీ పరిశ్రమలోని పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు 100కు పైగా సినిమాలకు కో-డైరెక్టర్ గా పని చేసిన విక్రమ్ గాంధీ, శివాజీ నటించిన 'స్టేట్ రౌడీ', హాస్యనటుడు వేణుమాధవ్ ప్రధాన పాత్రలో నటించిన 'ప్రేమాభిషేకం' సినిమాలకు దర్శకుడిగా పని చేశారు.

  • Loading...

More Telugu News