: యాత్రా దర్శిని ట్రావెల్స్ నిర్వాకం... హరిద్వార్ లో తెలుగు యాత్రికులకు చుక్కలు చూపించిన వైనం


యాత్రా దర్శిని ట్రావెల్స్ నిర్వాకంతో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడెంకు చెందిన యాత్రికులు హరిద్వార్ లో నానా ఇబ్బందులు పడుతున్నారు. పుణ్యక్షేత్రాల దర్శనం పేరిట వారిని అక్కడికి తీసుకెళ్లిన ట్రావెల్స్ ప్రతినిధి బీవీరెడ్డి వారికి చుక్కలు చూపించారు. 31 మంది యాత్రికులను హరిద్వార్ లోని ఒక హోటల్ గదులలో వదిలి వెళ్లిపోయారు. బిల్లు చెల్లించలేదని ఆరోపిస్తూ సదరు యాత్రికులను హోటల్ సిబ్బంది బయటకు గెంటివేసింది. దీంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. మూడురోజులుగా హరిద్వార్ లో బాధిత యాత్రికులు పడిగాపులు గాస్తున్నారు.

  • Loading...

More Telugu News