: ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరాం: గంటా


నీట్ నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ మినహాయింపుకు అంగీకరించని పక్షంలో న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీలను ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంకయ్యనాయుడు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News