: గెలుపే లక్ష్యంగా కోహ్లీ, రోహిత్... పోరాటం షురూ!


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు విశాఖ వేదికగా 41వ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో రెండు జట్లు గెలవాల్సిన అవసరం ఉంది. నాకౌట్ స్టేజ్ లో ఆడాలంటే ప్రతి మ్యాచ్ నెగ్గాల్సిన దశలో రెండు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే బ్యాటింగ్ లో బలంగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంబై ఇండియన్స్ బౌలర్లు అడ్డుకోగలరా? అన్న సందేహం నెలకొంది. ఈ మ్యాచ్ లో గేల్ ను బరిలో దించడంతో బెంగళూరు తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. అయితే గేల్, కోహ్లీ, డివిలియర్స్ కు అడ్డుకట్ట వేయడం ద్వారా విజయం సాధిస్తామని రోహిత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ మ్యాచ్ నెగ్గిన జట్టు పాయింట్ల పట్టికలో కాస్త ముందుకు జరిగే అవకాశం ఉంది. ఈ దశలో రోహిత్ టాస్ గెలిచి కోహ్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. గేల్, కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించగా, తొలి ఓవర్ లోనే సిక్సర్ బాదిన కోహ్లీ భారీ స్కోరుపై కన్నేశాడు.

  • Loading...

More Telugu News