: పాకిస్థాన్ ఆసుపత్రిలో కోమాలో సరబ్ జిత్


పాకిస్థాన్ లోని లఖ్ పత్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. నిన్న తోటి ఖైదీలు ఇటుకలు, కత్తితో సరబ్ జిత్ పై హత్యాయత్నం చేశారు. దాంతో వెంటనే పాక్ లోని జిన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దాడి సమయంలో అతని తలకు తీవ్ర గాయమైంది. తక్షణమే ఆపరేషన్ చేసేందుకు ఐసీయూలో చేర్చారు.

అయితే నిన్నటినుంచి సరబ్ జిత్ కోమాలోనే ఉండటంతో శస్త్ర చికిత్స చేయకుండా ఆపారు. ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితిలో ఎలాంటి చికిత్స చేయలేమని వైద్యులు చెబుతున్నారు. 23 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న సరబ్ జిత్ ఉరిశిక్ష అంచున బతుకు వెళ్ల దీస్తున్నాడు. మరోవైపు సరబ్ జిత్ పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News