: నేను అదృష్టవంతుడ్ని... కాదు, మనిద్దరం అదృష్టవంతులమే: మురిసిపోతున్న బాలీవుడ్ కొత్త దంపతులు


బాలీవుడ్ కొత్త జంట బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ లు ఒకరినొకరు పొగడ్తల్లో ముంచెత్తుకుంటున్నారు. నూతన దాంపత్య జీవితం ప్రారంభిస్తూనే హనీమూన్ కు మాల్దీవ్స్ కు వెళ్లిన ఈ జంట బీచ్ అందాలను ఆస్వాదిస్తూ అప్ డేట్స్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. హనీమూన్ లో వారి బెడ్ ఎలా ఉంది?...బీచ్ లో ఎంత సంతోషంగా ఉన్నదీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య దేవత అని...తాను అదృష్టవంతుడ్నని కరణ్ సింగ్ గ్రోవర్ మురిసిపోతూ ట్వీట్ చేస్తే...పక్కనే ఉన్న బిపాసా బసు 'మనిద్దరం అదృష్టవంతులమే' అంటూ ట్వీట్ సమాధానం చెప్పింది. వీరి ట్విట్టర్ ముచ్చట్లు చదువుతున్న అభిమానులు మాత్రం...మరీ అంత ప్రేమ ఉంటే, పక్కనే ఉన్న భార్యకు చెప్పవచ్చుకదా? ఈ బహిరంగ ప్రేమాయణమేంటని ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News