: మోదీ! మీకిది సిగ్గుచేటు కాదా?: కేరళలో మోదీ 'సోమాలియా' వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం


కేరళ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'పో మోనే మోదీ' (ఇక చాలు, ఇంటికి వెళ్లు) పేరిట హ్యాష్ ట్యాగ్ పెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా 'గాడ్స్ ఓన్ కంట్రీ' (దేవుని సొంత దేశం) అని పేరున్న కేరళలో శాంతి భద్రతలు సోమాలియా కంటే ఘోరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్య, దళిత యువతిపై అత్యాచారం ఇలా వేటినీ రాష్ట్ర ప్రభుత్వం ఆపలేకపోయిందని ఆయన విమర్శించారు. కేరళను సోమాలియాతో పోల్చడం పట్ల ఆక్కడి యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మలయాళంలో విజయం సాధించిన ఓ సినిమాలోని డైలాగ్ 'పో మోనే దినేశా' కు పేరడీగా 'పో మోనే మోదీ' అంటూ విమర్శలు సంధిస్తున్నారు. ఇలా సంబోధించడం దేశ ప్రధానిగా ఆయనకు సిగ్గుచేటు కాదా? అని కేరళ సీఎం ఉమెన్ చాందీ విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆయన విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News