: ‘హోదా’పై చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదం: గాలి


బీజేపీ నేతలపై తెలుగు దేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్యేక హోదాపై, రాష్ట్రానికి ఇచ్చిన నిధుల‌పై బీజేపీ నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ. లక్ష కోట్లు రాష్ట్రానికి ఎప్పుడు ఇచ్చారో బీజేపీ నేత‌లు చెప్పాల‌ని ప్రశ్నించారు. బడ్జెట్ స‌మావేశాల్లో కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అనుకూలంగా మాట్లాడ‌క‌పోవ‌డం త‌మ‌కు బాధ‌ క‌లిగించే విష‌య‌మేన‌ని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను రాబ‌ట్టే విష‌యంలో త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడిపై ప‌లువురు నేత‌లు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ను గాలి ముద్దుకృష్ణ‌మ తిప్పికొట్టారు. ఈ అంశంలో చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌ద‌మేన‌ని ఆయ‌న అన్నారు. కేంద్రంతో నేత‌ల‌లో స‌మావేశ‌మైన ప్ర‌తీసారి హోదా అంశాన్ని చంద్ర‌బాబు ప్రస్తావిస్తున్నారని ముద్దుకృష్ణ‌మ చెప్పారు.

  • Loading...

More Telugu News