: స్థానికుల అప్రమత్తతతో... లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం!
కృష్ణా జిల్లా భైరవపట్నం వద్ద లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. భైరవపట్నం వద్ద రెండు పట్టాలు కలిసే జాయింట్ విరిగిపోయింది. దీనిని గమనించిన స్థానికులు అటుగా వస్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు ఎదురెళ్లి ట్రైన్ ను నిలిపేయాలంటూ సైగలు చేశారు. వారిని గుర్తించిన రైలు డ్రైవర్ ఏదో ప్రమాదం ఉందని శంకించి ట్రైన్ ను ఆపేశాడు. దీంతో ఏం జరిగిందని స్థానికులను ఆడగడంతో విరిగిన పట్టాలను చూపించారు. పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్న సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. అనంతరం సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు.