: నాకిష్టమైన వాళ్లిద్దరూ ఒకే వేదికపై కనపడటంతో ఆనందించాను: హీరో ప్రభాస్


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు చిత్రం ‘బాహుబలి’. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. పలువురికి అభిమాన నటుడిగా మారిన ప్రభాస్ కు ఇద్దరంటే చాలా ఇష్టమట. అందులో ఒకరు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కాగా, మరొకరు ప్రముఖ దర్శకుడు రాజమౌళి అని ప్రభాస్ పేర్కొన్నాడు. 63వ జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్, ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అవార్డులందుకున్న అమితాబ్, రాజమౌళి లు ఒకే వేదికపై కలుసుకున్నారు. తనకు ఇష్టమైన వాళ్లిద్దరూ అలా ఒకే వేదికపై కలుసుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రభాస్ చెప్పాడు.

  • Loading...

More Telugu News