: షీనా బోరా గొంతు నులిమింది నేనే...నిజాలు చెబుతా: డ్రైవర్ శ్యాంవర్ రాయ్
స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ప్రధాన నిందితులుగా ఉన్న షీనా బోరా హత్యకేసులో ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారాడు. విచారణ ఖైదీగా జైలులో ఉన్న శ్యాంవర్ రాయ్ న్యాయస్థానంలో నిజాలు చెబుతానని అంటున్నాడు. ఇంతవరకు ఈ కేసులో వెల్లడికాని విషయాలను న్యాయస్థానంలో చెబుతానన్నాడు. షీనా బోరా గొంతు నులిమి ఊపిరాడకుండా చేసింది తానేనని శ్యాంవర్ అంగీకరించాడు. ఈ హత్యకు సంబంధించిన పలు విషయాలు తనకు తెలుసని, అవి న్యాయస్థానం ముందు ఉంచుతానని తెలిపాడు.