: ఇండియాకు పెట్టుబడులు తగ్గే సమయం... మార్కెట్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి!: ఫైనాన్స్ సెక్రటరీ శక్తికాంత్ దాస్


మారిషస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్ మెంట్ పై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశానికి వచ్చే పెట్టుబడులు తగ్గే అవకాశాలున్నాయని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మార్కెట్ వర్గాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సి వుందని ఆయన అన్నారు. కేంద్రం ఆర్థిక సంస్కరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని, భవిష్యత్తులో కరెంట్ ఖాతాల లోటు, ద్రవ్యోల్బణం తగ్గుతూ, వృద్ధి రేటులో ముందుకు వెళితే, పెట్టుబడుల మందగమనానికి బ్రేక్ పడుతుందని ఆయన వివరించారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ క్రమంగా పెరుగుతున్నందున ఇండియా ముందుముందు విదేశీ పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారుతుందని, పన్నుల ప్రభావం తాత్కాలికమేనని అన్నారు.

  • Loading...

More Telugu News