: మహబూబ్‌నగర్ లో విషాదం.. పుట్టింట్లో న‌వ‌వధువు ఆత్మ‌హ‌త్య


వివాహం జరిగిన రెండు నెలలకే ఓ న‌వ‌వ‌ధువు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోని కేశంపేట‌లో చోటుచేసుకుంది. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని అయిన యువ‌తికి రెండు నెల‌ల క్రితం పెద్ద‌లు పెళ్లి చేశారు. కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వ‌చ్చిన ఆ యువ‌తి ఈరోజు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని అంటించుకున్న న‌వ‌వ‌ధువు కాలిన గాయాల‌తో అక్క‌డికక్క‌డే మృతి చెందింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు యువ‌తి ఆత్మహత్యపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. న‌వ‌వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల గురించి తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News