: థ్యాంక్యూ మచ్ సార్!.. కేటీఆర్ కు హీరో సూర్య ట్వీట్
‘థ్యాంక్యూ మచ్ సార్ ! సో గ్లాడ్ ఆల్ లైక్డ్ 24’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సినీ హీరో సూర్య ట్వీట్ చేశారు. సూర్య నటించిన ‘24’ చిత్రం అద్భుతంగా ఉందని, ఆయన నటనా కౌశలం అమోఘం మంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ కు స్పందించిన సూర్య తన కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, తన కూతురు, కొడుకు ‘24’ సినిమా చూడాలని అనడంతో వెళ్లి చూశామని, స్క్రీన్ ప్లే, సూర్య నటన అద్భుతంగా ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.