: ‘ముద్దు’లపై పుస్తకం రాస్తానంటున్న బాలీవుడ్ హీరో
బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా పేరుపొందిన ఇమ్రాన్ హష్మీ ముద్దులు ఎలా పెట్టాలనే దానిపై పుస్తకం రాస్తానంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుస్తకం రాయాలన్న ఆలోచన తనకు ఉందని, అయితే, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఇంకా మొదలుపెట్టలేదని అన్నాడు. ‘ముద్దు’ ఎలా పెట్టాలనే అంశంపై పుస్తకాలు మార్కెట్ లో దరిదాపుగా లేవని అన్నాడు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఈ పుస్తక రచనకు త్వరలోనే శ్రీకారం చుడతానని చెప్పాడు. కాగా, ఈ పుస్తకం రాసేందుకని రచనలో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నాడని సమాచారం. ముద్దు సన్నివేశాలను అద్భుతంగా పండించడంలో ఇమ్రాన్ హష్మీ అందెవేసిన చెయ్యి అని బాలీవుడ్ వర్గాలు ప్రశంసించడం తెలిసిందే.