: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విజయసాయి రెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో విజయసాయి రెడ్డి ఎడమ మోకాలికి గాయమైంది. విజయసాయిరెడ్డితో పాటు గాయపడ్డ మరో నేత దుర్గాప్రసాదరాజును కూడా జగన్ పరామర్శించారు. దుర్గాప్రసాద్ రాజు తలకు ఎడమవైపున గాయాలయ్యాయి. కాగా, ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.