: స్నేక్ గ్యాంగ్ దోషుల కుటుంబ సభ్యుల ఆందోళన
హైదరాబాద్‌లో స్నేక్ గ్యాంగ్ చేసిన అకృత్యాలపై కొద్దిసేపటి క్రితం రంగారెడ్డి జిల్లా కోర్టు ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, మరొకరికి 20 నెలల జైలుశిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు అనంతరం రంగారెడ్డి కోర్టు దగ్గర పోలీసుల్ని దోషుల కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠాకు వేసిన శిక్ష పట్ల వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దోషుల్ని జైలుకి తీసుకెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.