: నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో దారుణం.. ఇనుప రాడ్లతో జూనియర్లపై దాడి చేసిన సీనియర్ విద్యార్థులు


నోయిడాలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్లో సీనియ‌ర్ విద్యార్థులు రెచ్చిపోయారు. క‌నీసం 16 ఏళ్ల వ‌య‌స‌యినా దాట‌ని సీనియ‌ర్‌ విద్యార్థులు ఏకంగా రాడ్ల‌తో ఇద్దరు జూనియర్ల విద్యార్థుల‌పై దాడి చేశారు. ఈ ఘటనలో 18మంది మైన‌ర్ల‌పై కేసు నమోద‌యింది. ధ్రువ్ అగర్వాల్, యాశ్ ప్రతాప్ సింగ్ అనే ఇద్ద‌రు జూనియ‌ర్ విద్యార్థులపై హాస్టల్లో సీనియర్ విద్యార్థులు దాడికి దిగారు. అంతేగాక జూనియ‌ర్ విద్యార్థులు తాము వేసుకున్న యూనిఫామ్‌ విప్పేయాలంటూ సీనియర్లు ఆర్డర్‌ వేశారు. చివ‌రికి ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో సీనియ‌ర్ విద్యార్థుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. సీనియ‌ర్ లు త‌మ‌ను ప్రతి రోజు ర్యాగింగ్ చేస్తున్నార‌ని, త‌మ‌ ముఖంపై ఆహారాన్ని విసిరేస్తున్నార‌ని జూనియ‌ర్ విద్యార్థులు మీడియాతో చెప్పారు. ఘ‌ట‌న‌పై జూనియ‌ర్ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ విద్యార్థుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News