: వెళ్లి సీఎం పీఠం ఎక్కండి... హరీశ్ రావత్ కు 'ఆల్ ది బెస్ట్' చెప్పిన సుప్రీం


ఉత్తరాఖండ్ లో విధించిన రాష్ట్రపతి పాలనను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వేళ, విశ్వాస పరీక్షలో విజయం సాధించిన హరీశ్ రావత్, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆయనకు ఎదురైన పరీక్షలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొందారని, 33 మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారని, 28 మంది వ్యతిరేకంగా నిలిచారని కోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా హరీశ్ కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి 'ఆల్ ది బెస్ట్' కూడా చెప్పారు. కాగా, మరికాసేపట్లో రాష్ట్రపతి పాలన తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News