: జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్: నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా మోదీ ట్వీట్
సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి టెక్నాలజీని ఉపయోగించుకుందామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు భారత్ ‘నేషనల్ టెక్నాలజీ డే’ జరుపుకుంటోన్న సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘దేశంలోని ప్రజలు, శాస్త్రవేత్తలు, ప్రత్యేకంగా టెక్కీలకు ఇవే నా అభినందనలు’ అని మోదీ పేర్కొన్నారు. జీవితంలో టెక్నాలజీ పరిధి మరింత విస్తృతం అవ్వాలని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. సమాజంలో మంచి మార్పుని తీసుకొచ్చే విధంగా టెక్నాలజీ వినియోగం ఉండాలని అన్నారు. ట్వీట్ చివరలో ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ అని పేర్కొన్నారు.