: చిక్కుల్లో అమితాబ్... 15 ఏళ్ల నాటి కేసును తిరగదోడేందుకు ఐటీ శాఖకు సుప్రీంకోర్టు అనుమతి


ఇప్పటికే అక్రమంగా విదేశాల్లో నల్లధనం దాచుకున్నారన్న ఆరోపణలతో విమర్శల పాలైన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. దాదాపు 15 సంవత్సరాల నాడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఆయన ఎగ్గొట్టారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆదాయపు పన్ను శాఖకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు కొద్ది సేపటి క్రితం తన నిర్ణయాన్ని వెలువరించింది. 2001లో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ద్వారా ఆయన పొందిన పారితోషికంలో పన్ను రూపంలో చెల్లించాల్సిన రూ. 1.66 కోట్లు కట్టలేదని ఐటీ శాఖ అప్పట్లో కేసు పెట్టగా, దాదాపు 11 ఏళ్లు సాగిన కేసును జూలై 2012లో బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీం నిర్ణయం అమితాబ్ కు వ్యతిరేకంగా రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News