: కంపూటర్లలో వాడే 'వాట్స్ యాప్' వర్షన్ విడుదల... డౌన్ లోడ్ సైట్ వివరాలు!
స్మార్ట్ ఫోన్లను వాడుతూ, సామాజిక మాధ్యమం వాట్స్ యాప్ లో చక్కర్లు కొట్టే వారికి శుభవార్త. మీరు వాడే కంప్యూటర్ లో సైతం వాట్స్ యాప్ ను లోడ్ చేసుకునే సదుపాయం ఇప్పుడు దగ్గరైంది. అటు విండోస్, ఇటు మాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆధారిత కంప్యూటర్లలో పనిచేసే వాట్స్ యాప్ వర్షన్ ను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ వెల్లడించింది. ఇది స్మార్ట్ ఫోన్ లోని యాప్ తో సింక్ అయి వుంటుందని, స్మార్ట్ ఫోన్లో యాప్ ఉంటేనే డౌన్ లోడ్ చేసుకోగలుగుతారని వాట్స్ యాప్ యాజమాన్య సంస్థ ఫేస్ బుక్ వెల్లడించింది. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే, https://www.whatsapp.com/download ను సందర్శించాల్సి వుంటుంది. అక్కడ కనిపించే విండోస్ (వర్షన్ 8 కన్నా లేటెస్ట్ అయ్యుండాలి), మ్యాక్ (10.9 వర్షన్ కన్నా లేటెస్ట్ అయ్యుండాలి) లింక్ లను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.