: జంక్ ఫుడ్‌తో కిడ్నీ వ్యాధులు
జంక్ ఫుడ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల్లో పరిశోధకులు మరో అంశాన్ని కనుగొన్నారు. జంక్ ఫుడ్ కిడ్నీ వ్యాధుల్ని తెచ్చిపట్టే ప్రమాదం ఉందని యూకేలోని అంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము ఎనిమిది ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ అంశం వెల్లడయిందని చెప్పారు. జంక్ ఫుడ్ వల్ల కిడ్నీల్లోని గ్లూకోజ్ వాహకాల సంఖ్య అసాధారణంగా పెరుగుతున్నట్లు వివరించారు. గ్లూకోజ్ వాహకాల సంఖ్యను నియంత్రించే దిశలో ప్రొటీన్లపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ లక్షణాలు రక్తంలో చక్కెర మోతాదు పెరిగిపోవడంతో మధుమేహుల్లో కిడ్నీల్లోని గ్లూకోజ్ వాహకాలపై తీవ్ర ప్రభావం పడి కిడ్నీ వ్యాధులొచ్చే అంశంతో దగ్గరగా ఉందని పేర్కొన్నారు. పిజ్జాలు, నూడిల్స్, కూల్ డ్రింక్ వంటి ఆహార పదార్థాలు అతిగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.