: హరీశ్ రావత్ గెలిచారు: ప్రకటించిన సుప్రీం


అందరూ అనుకున్నట్టుగానే నిన్న ఉత్తరాఖండ్ లో జరిగిన బలపరీక్షలో హరీశ్ రావత్ విజయం సాధించారు. ఆయన నెగ్గినట్టు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ప్రకటించింది. హరీశ్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్నారని వ్యాఖ్యానించింది. అంతకుముందు రాష్ట్ర సీఎస్ ఓ సీల్డ్ కవర్ లో విశ్వాస పరీక్ష ఓటింగ్ వివరాలు ధర్మాసనానికి అందించారు. రావత్ గెలిచినట్టు ధర్మాసనం వ్యాఖ్యలు విన్న ఏజీ, ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గాలు విజయోత్సవాలు చేసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News