: 'వాటే రొమాంటిక్...!'.. హనీమూన్ బెడ్ చిత్రాలను షేర్ చేసుకున్న బిపాషా బసు... మీరూ చూడండి!
గత నెల 30న వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంట బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ లు ఇప్పుడు హనీమూన్ కపుల్. వీరిద్దరూ హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లారన్నది నిన్నటి వరకూ ఎవరికీ తెలియని రహస్యం. కానీ ఆ రహస్యాన్ని బిపాషా వెల్లడించింది. తాము మాల్దీవుల్లో ఉన్నట్టు తెలియజేస్తూ, హనీమూన్ సూట్, బెడ్ చిత్రాలను తన అభిమానులతో పంచుకుంది. గులాబీ రేకులతో అందంగా అలంకరించిన బెడ్ పై ముద్దాడుతున్నట్టుగా ఉన్న రెండు హంసల రూపంలో మడతపెట్టబడ్డ బెడ్ షీట్ ను చూస్తే, ఎవరికైనా 'హౌ రొమాంటిక్!' అనిపించక తప్పదు. బిపాషా పోస్ట్ చేసిన ఆ చిత్రాలను మీరూ చూడవచ్చు.