: 30 ఏళ్లు సేవలందించిన 'సీ హారియర్లు' ఇక కనిపించవు!


భారత నౌకాదళ చరిత్రలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన సీ హారియర్ యుద్ధ విమానాలు ఇక కనిపించబోవు. వీటి సేవా కాలం పూర్తయిన నేపథ్యంలో నేడు వీటిని నౌకాదళం నుంచి తొలగించనున్నారు. గోవాలోని హన్సా బేస్ లో జరిగే ఓ కార్యక్రమంలో సీ హారియర్స్ స్థానంలో రష్యా తయారు చేసిన మిగ్ 29కే విమానాలను జోడించే అధికారిక లాంఛనం నావెల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ కే ధోవన్ సమక్షంలో జరగనుంది. 1960 ప్రాంతంలో తొలి సీ హారియర్ సేవలు ప్రారంభం కాగా, ఆపై ఎన్నో ఈ తరహా యుద్ధ విమానాలు భారత యుద్ధ నౌకలపై కొలువుదీరాయి. ఫాల్కండ్స్ వార్, రెండు గల్ఫ్ వార్లు సహా, బోస్నియా, హర్జిగోవినాల్లో జరిగిన యుద్ధాల్లో ఇవి పాలుపంచుకున్నాయి. నౌకాదళం నుంచి తొలగించిన సీ హారియర్లను వివిధ మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచుతామని భారత నౌకాదళాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News