: మాల్యా నేరగాడైతే ఆధారాలివ్వాలని బ్రిటన్ మెలిక!
ఇండియాలో బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించేది లేదని తెగేసి చెప్పిన బ్రిటన్ ఓ మెట్టు దిగింది. ఆయన నేరం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు చూపాలని కోరింది. ఆపై తాము విచారించి, నేరారోపణలు నిజమని భావిస్తే, విచారణకు సహకరిస్తామని మెలిక పెట్టింది. అప్పటి వరకూ ఆయన కోరుకుంటే తమ దేశంలోనే ఉండవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఆయన ఎక్కడున్నారన్న విషయం అధికారికంగా తెలియకపోగా, బ్రిటన్ ప్రకటనతో మాల్యా ఆ దేశంలోనే తలదాచుకున్నట్టు స్పష్టమైంది.