: 6.44 అంగుళాల మాసివ్ డిస్ ప్లేతో 'మీ మ్యాక్స్' అంటున్న జియోమీ!


చైనా కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న జియోమీ తాజాగా మరో సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. 6.44 అంగుళాల మరింత పెద్ద డిస్ ప్లేతో ఈ ఫోన్ ఉండటం విశేషం. 16/5 ఎంపీ కెమెరాలు, 4జీ, బ్లూటూత్, 4,850 ఎంఎహెచ్ బ్యాటరీ ఉండే ఈ ఫోన్ బరువు 203 గ్రాములు మాత్రమేనని సంస్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మూడు వేరియంట్లలో హెక్సా కోర్, ఆక్టా కోర్ ప్రాసెసర్లతో లభించే మీ మ్యాక్స్ ధరలు రూ. 15 వేల నుంచి రూ. 20,500 మధ్య ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్లకు అదనపు ఆకర్షణ.

  • Loading...

More Telugu News