: 'ఆలస్యంగా వచ్చారుగా, ఇక ఇంటికెళ్లండి' అన్న ఇండిగో!... శంషాబాదు వద్ద ప్రయాణికుల ఆందోళన
పౌర విమానయాన సంస్థలు ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. పలు కారణాలతో అప్పటికే ఎదురుచూస్తున్న ప్రయాణికులను ఎక్కించుకోకుండానే పలు విమానాలు ఎగిరిపోయాయి. తాజాగా ఆలస్యంగా వచ్చారన్న కారణం చూపి ఇండిగో ఎయిర్ లైన్స్ 20 మంది హైదరాబాదీ ప్రయాణికులకు షాకిచ్చింది. ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా చేరుకున్నారని చెప్పి, విమానం ఎక్కించుకునేందుకు ఆ సంస్థ సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో ఢిల్లీ వెళ్లేందుకు సమాయత్తమై వచ్చిన ప్రయాణికులు షాక్ తిన్నారు. ఇండిగో సిబ్బంది వ్యవహార సరళికి నిరసనగా శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.