: ఆ వార్తలన్నీ అవాస్తమే!.... టీడీపీలో చేరేది లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి


నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారంపై ఆయన కొద్దిసేపటి క్రితం స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమేనని ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు చెప్పారు. తన పార్టీ మార్పుపై ఇటీవల పలు వార్తా కథనాలు ప్రసారమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ అసత్యాలేనని ఆయన పేర్కొన్నారు. వైసీపీని తాను వీడబోనని ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News