: మోదకొండమ్మ ఉత్సవాల్లో అపశ్రుతి!... బాణాసంచా పేలుడులో చిన్నారి సహా ఐదుగురికి గాయాలు


విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతం పాడేరు పరిధిలో గడచిన మూడు రోజులుగా జరుగుతున్న గిరిజన దేవత మోదకొండమ్మ ఉత్సవాల్లో నిన్న రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా అక్కడ నిర్వహించిన బాణాసంచా పేలుడులో శరణ్య అనే చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు భక్తులు కూడా ఈ పేలుడులో గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల్లో ముగింపు సందర్భంగా ఈ అపశ్రుతి చోటుచేసుకోవడం గిరిజనులను షాక్ కు గురి చేసింది.

  • Loading...

More Telugu News