: నేను మర్చిపోలేని సెల్ఫీలలో ఇదీ కూడా ఒకటి: సాయిధరమ్ తేజ్
‘తాను మర్చిపోలేని సెల్ఫీలలో ఇదీ కూడా ఒకటి’ అంటూ ‘మెగా’ ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ అన్నాడు. వికలాంగుల కోసం ‘సుప్రీమ్’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికలాంగులతో కలిసి సాయిధర మ్ తేజ్, రాశిఖన్నా ఒక సెల్ఫీ దిగారు. ఈ సెల్పీని సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తనకు గుర్తుండి పోయే సెల్పీలలో ఇదీ ఒకటని, వారు చూపించిన ప్రేమ, అభిమానాలను తాను మరిచిపోలేనని, వారికి తన కృతఙ్ఞతలని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నాడు. కాగా, ‘సుప్రీమ్’ చిత్రంలో వికలాంగులు చేసిన ఒక ఫైట్ చాలా అద్భుతంగా ఉందంటూ విమర్శకులు సైతం ప్రశంసించిన విషయం తెలిసిందే.