: తాను చేసిన నేరాన్ని డబ్బుతో కప్పేసిన బంగ్లా క్రికెటర్!


ఇంట్లో పని మనిషిని వేధించిన బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హుస్సేన్ పై విధించిన నిషేధాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఎత్తివేసింది. గత ఏడాది తన ఇంట్లో పని చేస్తున్న 11 బాలికను షాదత్ హుస్సేన్, అతని భార్య న్రిట్టో షాదత్ వేధించారంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మీడియా తలకెత్తుకోవడంతో అతనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. తమ తప్పులేదని, తాము వేధించలేదని షాదత్ పేర్కోవడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బీసీబీ అతనిపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో వారు దోషులని తేలితే 14 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో బీసీబీ పెద్దలను కలిసిన షాదత్ తప్పు చేశానని క్షమించాలని వేడుకున్నాడు. తరువాత బాలిక తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి, డబ్బు చెల్లించి ఈ కేసును ఉపసంహరించుకునేలా చేశాడు. దీంతో అతనిపై విధించిన నిషేధాన్ని బీసీబీ ఎత్తివేసి, దేశవాళీ మ్యాచ్ లో ఆడుకోవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News