: బామ్మగారికి పండంటి బాబు పుట్టాడు!


పెళ్లయిన నలభై ఆరేళ్లకు ఆ జంట ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన మోహిందర్ సింగ్, దల్జీందర్ కౌర్ దంపతులు సంతానం కోసం కళ్లు కాయలు కాసేలా చూశారు. అయినప్పటికీ తమ ఆశను మాత్రం కోల్పోలేదు. ఈ నేపథ్యంలో దల్జీందర్ కౌర్ రెండేళ్ల పాటు ఐవీఎఫ్ చికిత్స చేయించుకుంది. గత నెల 19వ తేదీన మగ సంతానానికి డెబ్భై ఏళ్ల బామ్మగారు జన్మనిచ్చారు. దీంతో, ఆ దంపతులు ఆనందంలో తేలిపోతున్నారు. ఈ సందర్భంగా దల్జీందర్ కౌర్ మాట్లాడుతూ, దేవుడు తమ ప్రార్థనలు ఆలకించాడని, సంతానం కలగడంతో తన జన్మ సార్థకమైందని, తన భర్తను, బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News