: వార్నర్ అవుట్...నత్తనడకన సన్ రైజర్స్ బ్యాటింగ్
ఐపీఎల్ సీజన్ 9లో 40వ మ్యాచ్ విశాఖ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాదు, రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ మధ్య జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టుకు నాలుగో ఓవర్ లో ఆర్పీ సింగ్ షాక్ ఇచ్చాడు. సిరీస్ లో మంచి ఫాంలో ఉన్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ (11)ను పెవిలియన్ కు పంపాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ (33), విలియమ్సన్ (15) ఆచి తూచి ఆడుతున్నారు. ఇదే వేదికపై ముంబైతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాదు ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ లో ఆర్పీ సింగ్ ఒక వికెట్ తీశాడు. ఇతర బౌలర్లు పొదుపుగా పరుగులిస్తూ ఆకట్టుకుంటున్నారు.