: 95 శాతం కష్టం, 5 శాతం అదృష్టంతోనే విజయం సాధించాను : సివిల్స్ ర్యాంకర్ స్నేహజ


భవిష్యత్తులో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని సివిల్ సర్వీసెస్ -2015 ఫలితాల్లో 103 వ ర్యాంకు సాధించిన స్నేహజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు, మిత్రులు సహకారంతోనే తాను ఈ విజయాన్ని సాధించానని చెప్పారు. 95 శాతం కష్టం, 5 శాతం అదృష్టం అనేవి ఎప్పుడూ ఉంటాయని, గతంలో లక్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్లే తాను సాధించలేకపోయానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ కూతురు సిఏ చదివినా కూడా దేశానికి సేవ చేయాలనే ఆలోచనలో ఉందని, అందుకే సివిల్స్ వైపు మొగ్గుచూపిందని అన్నారు. ఆమె మంచి అధికారి అవుతుందని, దేశానికి సేవ చేస్తుందని తాము ఆశిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News