: విజయవాడలో రౌడీ మూకలపై పోలీస్ కొరడా
విజయవాడలోని రౌడీ మూకలపై పోలీసులు కొరడా ఝళిపించారు. మొగల్రాజపురంలోని సెంట్రల్ జోన్ ఏసీపీ సత్యానందం నేతృత్వంలో ఈరోజు తనిఖీలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, మొగల్రాజపురంలోని ఇసుక మోసే కూలీలపై నిన్న రౌడీ మూకలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇసుక మోయాలంటే తమకు రూ.200 చెల్లించాలంటూ రౌడీలు చేసిన డిమాండ్ ను ప్రశ్నించిన కూలీలపై కర్రలతో దాడులకు దిగారు. ఈ సంఘటనతో కూలీలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.