: నా భర్త, ఐఏఎస్ రేఖారాణిల నుంచి నాకు ప్రాణహాని ఉంది: పూజిత ఫిర్యాదు


తన భర్త విజయగోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒకప్పటి సినీ నటి పూజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన పూజిత తనకు విడాకులివ్వకుండా తన భర్త ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు తన ఐడీ ప్రూఫ్, తమ వివాహాన్ని తెలిపే సాక్ష్యాలు పోలీసులకు అందజేసినట్టు తెలుస్తోంది. తనకు, తన కుమారుడికి న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తమ బంధం బట్టబయలైందన్న కారణంగా విజయగోపాల్, రేఖారాణి నుంచి తమకు ప్రాణహాని తలపెట్టవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News