: నా ఈ 14 ప్రయాణానికి మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు: 'అల్లరి' నరేష్


తాను సినీ ప్రయాణం ప్రారంభించి 14 ఏళ్లు పూర్తైందని సినీ నటుడు 'అల్లరి' నరేష్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులు, నిర్మాతలు, దర్శకులు, సహనటులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రయాణం ప్రారంభించి 14 ఏళ్లైందని తెలిపాడు. తన 'అల్లరి' సినిమా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైందని, ఈ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్న 'అల్లరి' నరేష్ వెల్లడించాడు. ఈ ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఈ ప్రయాణం ఇంత సజావుగా సాగడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలని తెలిపాడు. అభిమానులు ఇలాగే తనపై ప్రేమాభిమానాలు చూపించాలని ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News