: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పై స‌భాహక్కుల నోటీసులిచ్చిన కాంగ్రెస్.. అస‌త్యాలు ప‌లికార‌ని వ్యాఖ్య‌


అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాఫ్ట‌ర్ కుంభ‌కోణం కేసులో త‌మపై అస‌త్య ఆరోపణలు చేసినందుకుగానూ ప్ర‌ధాని మోదీకి, ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారికర్‌కు తాము సభాహక్కుల నోటీసు ఇచ్చిన‌ట్లు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాఫ్ట‌ర్ కుంభ‌కోణం కేసులో పార్ల‌మెంట్ వెలుప‌ల‌ మోదీ, పారిక‌ర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బు తీసుకున్న‌ట్లు అస‌త్యాలు ప‌లికార‌ని కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు శాంతారామ్ నాయ‌క్‌ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ.. ప్రధాని మోదీకి పార్లమెంట్ లోపల, బయట అవినీతిపై మాట్లాడే హక్కు ఉందని అన్నారు. అయితే, మ‌రో కాంగ్రెస్ నేత ఆనంద్ శ‌ర్మ అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్ర‌ధాని మోదీ బాధ్య‌తాయుత‌మైన ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే చేయాలని, పార్ట‌మెంట్ లోన‌యినా దాని వెలుప‌ల‌యినా తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న జ‌వాబుదారీగా ఉండాల‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News