: సరికొత్త స్మార్ట్ ఫోన్ తో మార్కెట్ కు సవాల్ విసురుతున్న షియోమీ
స్మార్ట్ ఫోన్ మొబైల్ వాటాలో యాపిల్, శాంసంగ్ లకు పోటీ ఇస్తున్న చైనా యాపిల్ 'షియోమీ' సరికొత్త స్మార్ట్ ఫోన్ తో సవాలు విసిరేందుకు సిద్ధమవుతోంది. చైనా యాపిల్ గా పేరొందిన షియోమీ సరికొత్త ఫీచర్లతో అందుబాటు ధరల్లో ఫోన్లను అందిస్తుందని ఆ దేశంలో పేరుతెచ్చుకుంది. భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు విశేషమైన అవకాశాలు ఉండడంతో మనదేశంలో కూడా అడుగుపెట్టిన షియోమీ గుర్తించదగ్గ మార్కెట్ ను సొంతం చేసుకుంది. అయితే యాపిల్, శాంసంగ్ లకు ఉన్న మార్కెట్ ను ఇప్పటి వరకు విడుదల చేసిన వేరియంట్లతో కొల్లగొట్టలేకపోయింది. ఈసారి అలా కాకుండా యాపిల్, శాంసంగ్ మార్కెట్ ను కొల్లగొట్టాలని సరికొత్త స్మార్ట్ ఫోన్ తో బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. 6.44 అంగుళాల డిస్ ప్లే, రియర్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్, 4850 మెగాహెర్జ్ బ్యాటరీ సామర్థ్యం కలిన ఫోన్ ను భారత మార్కెట్ లో విడుదల చేసేందుకు సిధ్ధమవుతోంది. 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ధర 15,350, 17,400, 20,450 రూపాయలుగా ఉండనుంది. 128 జీబీ ఫోన్ 4 జీబీ ర్యాం సదుపాయం ఉండగా, మిగిలిన రెండూ 3 జీబీ ర్యాంను కలిగి ఉంటాయని షియోమీ తెలిపింది. స్కానర్, 4జీ, డ్యుయల్ సిమ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయని ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఈ మోడల్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందన్నది మాత్రం చెప్పకపోవడం విశేషం.