: ఈ సినిమా చూడని వాళ్లు దయచేసి చూడండి: హీరో అమీర్ ఖాన్


మరాఠీ చిత్రం ‘సైరాత్’ను చూడని వాళ్లు దయచేసి చూడాలని, ఈ చిత్రంలో చివరి సన్నివేశం నుంచి తాను ఇంకా కోలుకోలేదని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే సైరాత్ సినిమా చూశాను. నా హృదయం చలించిపోయింది. ఈ చిత్రంలో చివరి సన్నివేశం నుంచి ఇంకా కోలుకోవాల్సి వుంది. ఈ సినిమా చూడనివాళ్లు దయచేసి చూడండి’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైరాత్ చిత్రంలోని నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News