: 'అల్లాహో అక్బర్' అంటూ ట్రైన్ లో నలుగురిని పొడిచేశాడు... జర్మనీలో ఘోరం!


పాశ్చాత్యదేశాల్లో అల్లా పేరుతో జరుగుతున్న హత్యలకు అడ్డుకట్టపడడం లేదు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ట్రైన్ లో ఓ వ్యక్తి నలుగురు ప్రయాణికులపై కత్తితో విరుచుకుపడ్డ ఘటనతో ఇతర ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. నిందితుడు 'అల్లాహో అక్బర్' అంటూ నినాదాలు చేస్తూ నలుగురు ప్రయాణికులను కత్తితో పొడిచేశాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది, మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఐఎస్ఐఎస్ పై జర్మనీ యూరోపియన్ యూనియన్ లోని మిత్రదేశాలతో కలిసి పోరాడుతోంది. ఫ్రాన్స్, బెల్జియం దేశాలపై బాంబుదాడులు, తుపాకీ కాల్పులతో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జర్మనీ విషయంలో మాత్రం తీవ్రవాదులు వ్యూహం మార్చారు. వలస వాదులకు జర్మనీ అనుమతిచ్చి ఆశ్రయం కల్పించిన తరువాత అక్కడ అత్యాచారాలు పెరిగిపోయాయి. తాజాగా జరిగిన కార్నివాల్ సందర్భంగా పదుల సంఖ్యలో అత్యాచారాలు చోటు చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News