: 'బాండ్' గర్ల్స్ రేసులో పోటీ పడుతున్న 'బాజీరావ్' గర్ల్స్


'జేమ్స్ బాండ్' సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు కొత్త 'జేమ్స్ బాండ్'ను వెతికే పనిలో బాండ్ సినిమాల రూపకర్తలు బిజీగా ఉన్నారు. అదే సమయంలో బాండ్ సరసన నటించే కొత్త నటీమణుల కోసం కూడా వారు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునేలలో ఒకరిని బాండ్ గర్ల్ పాత్ర వరించే అవకాశం ఉందని హాలీవుడ్ కథనాలు పేర్కొంటున్నాయి. 'బేవాచ్' సినిమాతో ప్రియాంకా, 'ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమాతో దీపికా పదుకునే హాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. గతంలో భారతీయ చిత్రపరిశ్రమ నుంచి పలువురు నటిమణులు హాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ, హాలీవుడ్ లో వీరిద్దరూ సంపాదించుకున్న క్రేజ్ ను మాత్రం వారు సంపాదించలేకపోయారు. వీరిద్దరూ భారీ ప్రాజెక్టుల్లో స్థానం సంపాదించుకోవడానికి తోడు, వీరికి మంచి సపోర్టింగ్ టీమ్ ఉండడంతో వివిధ హాలీవుడ్ సినిమాల్లో వీరిని తీసుకోవాలని స్టూడియోలకు ప్రతిపాదనలు వెళ్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇంకీ బాండ్ గర్ల్ గా 'బాజీరావ్' గర్ల్స్ లో ఎవరు ఎంపికవుతారో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News