: నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతం.. మూడు నెలల తరువాత తల్లిదండ్రుల వద్దకు చేరిన బాలుడు


హైదరాబాద్ శివారులోని నాగోల్ మమతానగర్‌లో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంత‌మైంది. మూడు నెల‌ల క్రితం కిడ్నాప్‌కు గురైన శివాజీని ఆచూకీని పోలీసులు ఎట్ట‌కేల‌కు క‌నిపెట్టారు. మూడు నెల‌ల త‌రువాత శివాజీ త‌న త‌ల్లిదండ్రుల‌ను క‌లుసుకున్నాడు. ఈరోజు మ‌ధ్యాహ్నం హ‌య‌త్ న‌గ‌ర్ స‌మీపంలో శివాజీ ఉన్న‌ట్లు పోలీసులు తెలుసుకొని, బాలుడిని కిడ్నాప‌ర్ల నుంచి ర‌క్షించారు. మొద‌ట డ‌బ్బుకోస‌మే ఈ కిడ్నాప్ జ‌రిగింద‌ని భావించారు. అయితే తమకు మ‌గ‌పిల్లాడు లేకపోవడంతో అతనిని పెంచుకోవాలన్న ఉద్దేశంతో బాలుడిని నిందితులు కిడ్నాప్ చేసినట్లు స‌మాచారం. కిడ్నాప్ ఉదంతంలో ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News