: ఆ నైతికత జగన్ కు ఎక్కడిది?: మంత్రి దేవినేని ఉమ


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఒక్క మాట కూడా అనని వైకాపా అధినేత వైఎస్ జగన్ కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఘాటైన విమర్శలు చేశారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేకనే జగన్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్ పార్టీ ధర్నాలంటూ కొత్త డ్రామాకు తెరలేపిందని అన్నారు. హంద్రీనీవా, హిందూపూర్, కుప్పం కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు నీరందించేందుకు తాము కట్టుబడివున్నామని తెలిపారు. మైలవరం రిజర్వాయర్, పోతిరెడ్డి పాడు కాలువలను సత్వరమే పూర్తి చేయనున్నామని తెలిపారు. ఏడాదిలోపు పట్టిసీమను పూర్తి చేసి చూపామని, మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ అదే విధమైన అంకితభావముందని అన్నారు.

  • Loading...

More Telugu News