: వాతావరణంలో మార్పుల్లేవ్.. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు


తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మ‌రో రెండు రోజులు వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం క‌న‌బ‌డ‌టం లేదు. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప‌లు చోట్ల వ‌డ‌గ‌ళ్ల వాన ప‌డవ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు తెలిపారు. దీంతో మరో రెండు రోజుల పాటు చ‌ల్లని వాతావ‌ర‌ణ‌మే కొన‌సాగే అవ‌కాశ‌మున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News