: చెయ్యి చూశావా, ఎంత రఫ్ గా ఉందో...!: 'గ్యాంగ్ లీడర్' డైలాగుని డబ్ స్మాష్ చేసిన రాంచరణ్


పాతికేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో డైలాగ్స్, పాటలు, మ్యూజిక్.. ఒకటేమిటి అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘చెయ్యి చూశావా, ఎంత రఫ్ గా ఉందో.. రఫ్పాడించేస్తా’ అంటూ ఆ చిత్రంలో చిరంజీవి చెప్పే డైలాగ్ కు థియేటర్లలో అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ డైలాగ్ నే మెగాస్టార్ తనయుడు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ డబ్ స్మాష్ చేశాడు. ఈ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, తమిళ చిత్రం ‘తనీ ఒరువన్’ ను తెలుగులో ‘ధ్రువ’గా రాంచరణ్ రీమేక్ చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News